శ్రీ విరాట్ విశ్వకర్మ – విశ్వబ్రాహ్మణులు

శ్లో !! నభూమి ర్ణజలం చైవ – నతేజో నచ వాయవ
నచబ్రహ్మన విష్ణుశ్చ = నచరుద్రశ్చ తారకా !
సర్వశూన్య నిరాలంబే – స్వయం భూ విశ్వకర్మణః !!

భూమి , నీరు , అగ్ని , వాయువు,  ఆకాశము నక్షత్రములు,  సూర్య- చంద్రులు, ఇవేమియు లేయ సర్వమూ శూన్యమై నిరాధారముగా నున్న సమయమున శ్రీ విశ్వకర్మ భగవానుడు స్వయంభువుగా ముందుగా తననుతాను పంచభూత తత్వాత్మకుడై పంచతత్వములతో సృష్టించుకొని ఈ సమస్త సృష్టించుకుని అనగా సర్వలోకములను, దేవదానవ , యక్ష, కిన్నెర, కింపురుష, జంతు , క్రిమి , కీటక , మానవాది , సర్వజీవులను సృష్టించి వానికి పాలకులుగా సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానాది పంచ ముఖములతో,   ప్రాక్ , దక్షిణ, పశ్చిమ, ఉత్తర, ఈశానాది  పంచదిక్కులతో ఋక్ , యజు, సామ, అధర్వణ, ప్రణవాది పంచవేదములతో,    స్పటిక, నీల, తామ్ర, ధూమ్ర, సువర్ణాది పంచవర్ణములతో,    పృధ్వీ , ఆప తేజో, వాయురాకాశాధి పంచ భూతత్వములతో  త్వక్క్ , చక్షు, శ్రవణ , జిహ్వా, ఘ్రానాది పంచజ్ఞానేంద్రియములతో , వాక్కు , పాణి , పాద, పాము, గుహ్వాది పంచకర్మేంద్రియములతో,  శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది పంచ తన్మాత్రలతో దశభుజములు , దశహస్తములు, గల్గి , శూలం, ఢక్కా , అభయ , వరదా, గదా , శంఖ, చక్ర, అబ్జ, కోశ, లేఖిని మొదలగు ఆయుధములు ధరించి, మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞాది పంచాబ్రహ్మలుగా వారికి భార్యలుగా  ఆదిశక్తి, పరాశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తులను ,  మహేశ్వర, విష్ణు, బ్రహ్మ, ఇంద్ర, , ఆదిత్యాది పంచమూర్తులు వారికి భార్యలుగా పార్వతి , లక్ష్మి, సరస్వతి, శచి , సంజ్ఞాదులను సృష్టించెను. 

సర్వసృష్టి కారకుడైన శ్రీ విశ్వకర్మ భగవానుని వేదములలో ఉపనిషత్తులలో పరమాత్మ, ప్రజాపతి, విరాట్టు, సృష్టికర్త , జగదీశ్వరుడు, జగాన్నిర్మాణకర్త, బ్రహ్మణస్పతి, బ్రాహ్మణ్యుడు, నారాయణుడు, హిరణ్యగర్బుడు, త్వష్ట సహస్రశీర్షుడు, గణపతి , ఈశానుడు, ఆదిదేవుడు, నిరంజనుడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, ప్రణవస్వరూపుడు, ఆదిమధ్యాంతరహితుడు, సర్వాంతర్యామి, జగద్గురువు, జగద్రష్ట , జగత్శిల్పి అనే అనేక పేర్లతో కీర్తించి ఉన్నారు.

అట్టి విశ్వకర్మ లోకపాలనా బాధ్యతలు మను, మయ, త్వష్ట, శిల్పి,  విశ్వజ్ఞాది బ్రహ్మర్షులకు అప్పగించిన వారు తమ అంశచే  సానగ, సనాతన, అహభూన , ప్రత్న, సుపర్ణసాది , పంచాబ్రహ్మర్షులను సృష్టించగా వారు సర్వ మానవ జీవనార్దము తమ వంశీయులకు విశ్వబ్రాహ్మణులకు గోత్ర ఋషులై   అయో, దారు, తామ్ర, శిల్పి, సుపర్ణాది పంచవృత్తులు నవలంభించి సర్వజనావళికి జీవనాదారులై జగదుపకారులుగా పంచార్షేయ బ్రాహ్మణులుగా “  విశ్వబ్రాహ్మణులుగా” అలరారుచున్నారు.

కానీ నేటి విశ్వబ్రాహ్మణ యువకులు తమ గోత్రములు పలుకుటలో సానగ అనుటకు బదులు సానస అని , సనాతన అనుటకు బదులుగా సనాసన  , సనకసన అనియు, అహభూన అనుటకు బదులుగా అపోసన అనియు,   సుపర్ణస అనుటకు బదులుగా సువర్నస అనియు పలుకూచున్నారు.  కానీ ప్రాచీన ప్రామాణిక గ్రంథ ఆధారములను బట్టి  “ సానగ, సనాతన, అహభూన , ప్రత్న, సుపర్ణ” అని తమ గోత్రములు పలుక ప్రార్థన.

WhatsApp
Call Us